Nivetha Thomas : వకీల్ సాబ్ భామ సాహసం.. కిలిమంజారో పర్వతం అధిరోహించిన నివేదా థామస్..

Nivetha Thomas: ఇటీవలే పవన్ కళ్యాణ్  ‘వకీల్ సాబ్’  సినిమాలో  ముఖ్య పాత్రలో  నటించిన నివేద థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2016లో నాని జెంటిల్ మ్యాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన నటనతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అదిపెద్ద పర్వతమైన కిలిమంజారో అధిరోహించింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.