నివేదా థామస్.. నాని 'జెంటిల్ మెన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ కేరళ కుట్టి. ఇటీవలే 'బ్రోచేవారెవరురా'.. సినిమాతో మంచి హిట్ అందుకున్న నివేదా ప్రస్తుతం నాని సరసన 'వి' అనే చిత్రంతో నటిస్తోంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ భామ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ సినిమా హిందీ పింక్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.