Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల నివేథా పేతురాజ్. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. అయితే సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. Photo: Instagra
ఇక లేటెస్ట్గా ఆహా కోసం బ్లడీ మేరీ అనే సినిమా చేసారు నివేథా.. ఈ సినిమాలో ఆమె తన నటనతో ఇరగదీశారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా చేశారు. ఈ చిత్రంలో కిరీటి దామరాజు, రాజ్‌కుమా కోపిశెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అనుకోని హత్యకేసులో ఇరుక్కున్న ముగ్గురు స్నేహితులు ఎలా తప్పించుకున్నారు అనేది చిత్ర కథ. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ మరో కీలక పాత్ర పోషించారు. సినిమాకు మంచి ఆదరణ పొందుతోంది. Photo: Twitter
ఇక నివేథా తాజాగా విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో నటించింది . విశ్వక్ సేన్, (Vishwak Sen Nivetha Pethuraj ) నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పాగల్’ . దిల్ రాజు సమర్పణలో బెక్కెమ్ వేణుగోపాల్ ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై నిర్మించారు. టీజర్స్ ట్రైలర్స్ కారణంగా మంచి అంచనాల మధ్య ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది Photo: Instagram
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Paagal On Amazon Prime) దక్కించుకుంది. అందులో భాగంగా పాగల్ సెప్టెంబర్ 3నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాగల్ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా హీరో విశ్వక్ సేన్ విషయానికి వస్తే... ఆయన మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభిం చి ఆ తర్వాత నటుడుగా మారారు. Photo: Instagram
Nivetha Pethuraj : ఇండి ఫిల్మ్ వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. విశ్వక్ సేన్ తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు విశ్వక్. ఇక ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ఫలక్నామా దాస్‌లో నటించడంతో పాటు ఆ సినిమాను నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు విశ్వక్ సేన్. Photo : Twitter
ఇక విశ్వక్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే.. తమిళ హిట్ సినిమా ఓ మై కడవులేలో విశ్వక్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని తెలుస్తోంది. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై తెలుగులో రీమేక్ చేస్తున్నారు. Photo: Instagram
నివేథా ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా వస్తోన్న విరాట పర్వంలో నటిస్తోంది. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిచ్చారు. విరాటపర్వం సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మించారు. Photo: Twitter
కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ (Mukhachitram) చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కే ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వామిత్ర పాత్రలో కనిపించనున్నారు. . Photo: Instagram
ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్.. తమిళ సూపర్ హిట్ ప్రేమకథ చిత్రం ఓ మై కడవులే రీమేక్‌లో విశ్వక్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను పివిపి సినిమా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది.. Photo: Instagram
ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) దేవుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని తెలుస్తోంది. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ నట ప్రయాణం విషయానికి వస్తే.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారారు విశ్వక్. టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. . Photo: Instagram
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికవరకు గడ్డంతో కాస్త రఫ్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా కోసం పూర్తిగా తన మేకోవర్ని మార్చుకుని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నారు.. Photo: Twitter