నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో అదరగొట్టిన ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. (Twitter/Photo)
మంచి అంచనాల నడుమ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్ మోస్ట్ 950 వరకు థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. (Twitter/Photo)
కొత్త దర్శకుడితో మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అంతేకాదు మంచి హిట్ కోసం చూస్తున్న అతని అభిమానులను నిరాశపరిచింది. దీంతో ఆ సినిమా తర్వాత నితిన్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ఇప్పటి వరకు కొత్త సినిమాలను మొదలు పెట్టలేదు. . Twitter/Photo
గతంలో సైన్ చేసిన కొత్త సినిమాల షూటింగ్‌ను ప్రారంభించలేదు. నితిన్, వక్కంతం వంశీతో కలిసి ఒక సినిమా కోసం పని చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీలీల హీరోయిన్.. అయితే మాచర్లతో దెబ్బ తిన్న నితిన్.. ఈ కొత్త సినిమా పట్ల జాగ్రత్తగా ఉంటున్నాడట. అందులో భాగంగా స్క్రిప్ట్‌లో పెద్ద మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. Macherla Niyojakavargam Photo : Twitter
ఇక మాచర్ల నియోజకవర్గం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) - రూ. 3 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ -రూ. 10 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 19 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.20 కోట్లు.. ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 21.20 కోట్లు జరిగింది. (Twitter/Photo)
కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే కలెక్టర్ రోల్లో నితిన్ నటించారు. ఈ సినిమా నైజాంలో 235 థియేటర్స్‌లో విడుదల కానుంది. రాయలసీమలో 125, ఆంధ్రప్రదేశ్ -300, ఏపీ + తెలంగాణ 660, కర్ణాటకల + రెస్టాఫ్ భారత్ 80 థియేటర్స్+ ఓవర్సీస్లో 200 స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 940 థియేటర్స్‌లో విడుదలైంది. (Twitter/Photo)
‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. అయితే సినిమాకు మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. (Twitter/Photo)
ఇక... నితిన్ విషయానికి వస్తే.. ఈ మధ్య వరస ఫ్లాపులతో బాగా డీలా పడిపోయాడు నితిన్. భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత నితిన్ నటించిన చెక్, రంగ్ దే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓటిటిలో విడుదలైన మాస్ట్రో పర్లేదనిపించింది. తాజాగా మాచర్ల నియోజకవర్గం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నితిన్ ఆశలన్నీ వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. Photo : Twitter