నాలుగేళ్ల క్రితం సరిగ్గా 7 జూలై 2017లో ఈ సినిమా విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాతో శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. డీవీవీ ప్రొడక్షన్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. (Twitter/Photo)
’నిన్ను కోరి’ మూవీ ఏపీ + సీడెడ్ (రాయలసీమ)లో 12.65 కోట్లు వసూళు చేసింది. నైజాం (తెలంగాణ)లో 9.55 కోట్లు వసూళ్లు సాధించింది. తెలంగాణ, ఏపీ కలిపి రూ. 22.20 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలపి దాదాపు రూ. 6 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మొత్తంగా రూ. 29 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా పెట్టిన పెట్టుబడికి రూ. 11 కోట్లు లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)