సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాతో ఎక్కువ పాపులారిటీ పొందుతుంటారు కొందరు హీరోయిన్స్. అందులో నిక్కీ తంబోలి ఒకరు. ‘తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించిన నటి నిక్కీ తంబోలి. సినిమాలతో సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది. ( Image Credit : Instagram)
ఇక నిక్కి తంబోలి ఫోటో పోస్ట్ చేయగానే నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది నెగిటివ్ గా కూడా ఇలాంటి డ్రెస్సులు ఇంకా ఎన్ని రోజులు వేస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమెకు సపోర్ట్ చేసేవారు అయితే నిక్కీ తంబోలి మంచి గ్లామరస్ హీరోయిన్ అని ఆమెకు మంచి అవకాశాలు లభిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ( Image Credit : Instagram)
మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అడల్ట్ కంటెంట్ కావడంతో అమ్మడి పేరు ఇండస్ట్రీలో కాస్త హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తర్వాత కాంచన 3 సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా రాఘవ లారెన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఆ తర్వాత టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడిగా వచ్చిన తిప్పరామీసం సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించింది.( Image Credit : Instagram)
ఇక బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ బిజీ అయ్యేందుకు మొదట టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోనే కాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె ఎక్కువగా రియాలిటీ షోలతో నే హిందీ మార్కెట్ లోకి అడుగు పెట్టే ప్రయత్నం చేస్తోంది. బిగ్ బాస్ లో ఆమె సల్మాన్ ఖాన్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంది..( Image Credit : Instagram)