Nikhila Vimal : మలయాళ, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక మార్క్ చూపిస్తోంది నిఖిలా విమల్. టీవీ ద్వారా యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన ఆమె... 2009లో మలయాళ సినిమా భాగ్యదేవతతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. భరతనాట్నం, కూచిపూడి, కేరళ నటనమ్ ఇవన్నీ నేర్చుకోవడం ఆమెకు ప్లస్ పాయింట్స్. 2016లో వెట్రివల్ సినిమాతో... కోలీవుడ్‌లో అలరించిన ఈ కేరళ కుట్టీ... 2017లో వచ్చిన మేడ మీద అబ్బాయి సినిమాతో... తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులోనే గాయత్రి సినిమా చేసి... మళ్లీ శాండల్‌వుడ్, కోలీవుడ్ వైపు చూసింది. ఇప్పటివరకూ 12 సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ... మరో రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.