కార్తికేయ 2 సినిమా ఇపుడు దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. చిన్న సినిమాగా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక అది అలా ఉంటే కార్తికేయ2 టీమ్‌కు అదృష్టం ఓ రేంజ్లో కలిసివస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 120 కోట్లకు పైగా వసూలు చేసి, పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా కేక పెట్టిస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. Photo : Twitter
చందూ మొండేటి తెరకెక్కించిన ఈ లేటెస్ట్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషాల్లో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఇప్పటికే థియేటర్స్‌లో ఓ ఊపు ఊపిన కార్తికేయ2 ఇక ఓటీటీలో ఏ రేంజ్లో ఆకట్టుకోనుందో చూడాలి. Photo : Twitter
సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.. Photo : Twitter
ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి తత్త్వం గురించి చెప్పే డైలాగులు ఆడియన్స్‌ను గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయి. ఆ ఒక్క సన్నివేశమే ఈ సినిమాను ఎక్కడో కూర్చోబెట్టింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడిని మించిన ఫిలాసఫర్, డాక్టర్, సైంటిస్ట్, గైడ్, వ్యవసాయదారుడు, యుద్ధ వీరుడు లేడంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి. (Twitter/Photo)
ఇక ప్రస్తుతం 118 పేజేస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో పాటు స్పై అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక నిఖిల్ సిద్దార్థ పర్సనల్ విషయానికి వస్తే.. నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. (Twitter/Photo)
అంతకంటే ముందు హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేశాడు. నిఖిల్ హైదరాబాద్‌లో బేగంపేటలో జూన్ 1 1985 న జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లోని "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" కాలేజ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. (Twitter/Photo)