యువ నటుడు నిఖిల్ ఆమధ్య కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణ పొందింది. అంతేకాాదు నిఖిల్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఆ సినిమా తర్వాత నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనా నడుమ వచ్చిన ఈ చిత్రం 2022 డిసెంబర్ 23న విడుదలై మంచి ఆదరణ పొందింది. Photo : twitter
ఈ సినిమాలో హీరో నిఖిల్ సిద్ధార్థ్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ చేసింది. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించారు. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo : twitter
ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహాతో పాటు ఇంటర్నేషనల్ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకేరోజు ఈ చిత్రం ఈరెండు స్ట్రీమింగ్ యాప్స్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. అంతేకాదు ఓటీటీలో కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. Photo : twitter
ఇక లేటెస్ట్గా ఈచిత్రం టీవీలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టీవీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకున్న జీ తెలుగులో ఈసినిమాకు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఈ సినిమా అతి త్వరలో జీతెలుగులో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. అయితే ఏ రోజు ప్రసారం అవుతుందో అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ లపై సంయుక్తం గా నిర్మించారు. చూడాలి మరి టీవీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో.
18 పేజేస్ ఫ్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 5.15 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో రూ. 1.00 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్.. రూ. 3.29 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 9.44 కోట్లు..(రూ. 18 కోట్ల గ్రాస్) కర్ణాటక + రెస్టాఫ్ భారత్ రూ. 0.76 కోట్లు.. ఓవర్సీస్.. రూ. 1.63 కోట్లు.. టోటల్ రూ. 11.83 కోట్లు వసూళు చేసింది. ఈ సినిమా రూ. 10.30 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 11.83 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ. 83 లక్షలు లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం రన్‌టైమ్ విషయానికి వస్తే .. ఈ చిత్రం 2 గంటల 17 నిమిషాల నిడివితో ఉండనుంది. అంటే చాలా తక్కువ నిడివి అన్నమాటే. చూడాలి మరి సినిమా ఎలా ఉండనుందో.. పోసాని కృష్ణ మురళి, సరయు, అజయ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Photo : twitter
ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా ఇరగదీసింది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ లేటెస్ట్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషాల్లో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్స్‌లో ఓ ఊపు ఊపిన కార్తికేయ2 ఓటీటీలో కూడా మంచి వ్యూస్‌ను సంపాదిస్తోంది. Photo : twitter
ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి తత్త్వం గురించి చెప్పే డైలాగులు ఆడియన్స్‌ను గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయి. ఆ ఒక్క సన్నివేశమే ఈ సినిమాను ఎక్కడో కూర్చోబెట్టింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడిని మించిన ఫిలాసఫర్, డాక్టర్, సైంటిస్ట్, గైడ్, వ్యవసాయదారుడు, యుద్ధ వీరుడు లేడంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న కార్తికేయ3కి మరింత బజ్ క్రియేట్ అయ్యింది. Photo : twitter
. అందుకే కార్తికేయ-3 సినిమాపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. ఇక అది అలా ఉంటే కార్తికేయ 2 ద్వారక టెంపుల్ నేపథ్యంలో సాగగా.. కార్తికేయ-3 సినిమా అయోధ్య రామమందిరం నేపథ్యంలో రానుందని తెలుస్తోంది. ఇక ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని.. అతి తర్వలోనే షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. Photo : twitter
నిఖిల్ ప్రస్తుతం స్పై అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక నిఖిల్ సిద్దార్థ పర్సనల్ విషయానికి వస్తే.. నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. అంతకంటే ముందు హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేశాడు. నిఖిల్ హైదరాబాద్‌లో బేగంపేటలో జూన్ 1 1985 న జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లోని "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" కాలేజ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. Photo : twitter