‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కార్తికేయ 2’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేసింది. పాన్ ఇండియా రేంజ్ లో అటు అమెరికాలో కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ రావడం విశేషం. ఇంత గొప్పగా ఈ సినిమా వసూళ్ళను సాధిస్తోందని ఎవ్వరూ ఊహించలేదు Karthikeya 2 to stream on zee5 Twitter
కార్తికేయకు సీక్వెల్గా ఎనిమిదేళ్ల తర్వాత కార్తికేయ 2ను తెరకెక్కించారు. కార్తికేయ 2 సినిమా చివర్లో కూడా సీక్వెల్ ఉంటుందని చెప్పారు. ఎండింగ్ లోనే సీక్వెల్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ని మనకు చూపించారు. దీంతో కార్తికేయ 3 పై అందరి దృష్టి పడింది. కానీ కార్తికేయ 3 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించటల్లేదు.
కార్తికేయ మొదటి భాగాన్ని కేవలం 6 కోట్ల బడ్జెట్ తోనే నిర్మించారు. అది బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. ఇక రెండవ భాగాన్ని 15 కోట్లతో నిర్మించారు. అది ఏకంగా 120 కోట్ల వసూళ్లని సాధించింది. ఈ నేపథ్యంలో మూడవ భాగానికి భారీగా బడ్జెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లోకి బడా నిర్మాణ సంస్థలు ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.