Karthikeya 2 : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల కిందట సూపర్ హిట్ అందుకున్న ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ ట్రైలర్‌తోనే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకుని మొదటి ఆట నుంచే అదరగొడుతోంది. Photo : Twitter
మొదట్లో చాలా పరిమిత థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్యాక్డ్ హౌస్‌లతో వావ్ అనిపిస్తోంది.. తెలుగులో ఇరగదీస్తోన్న ఈ సినిమా హిందీ రాష్ట్రాల్లో కూడా ఇరగదీస్తోంది. మొదట 50 స్క్రీన్స్‌తో ప్రారంభంమైన ఈ సినిమా ఇప్పుడు 3000 పైగా స్క్రీన్స్‌తో వావ్ అనిపిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. Photo : Twitter
హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకు 9 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆరు రోజుల్లో 16కోట్ల షేర్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కోంటున్నాయి. ఇక మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్లో కూడా అదరగొడుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా 7లక్షల డాలర్స్‌ను వసూలు చేసింది. అతి త్వరలో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్స్ క్లబ్లో చేరనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషాల్లో కలిపి దాదాపుగా 60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని ప్రకటించింది చిత్రబృదం. Photo : Twitter
ఇక మరోవైపు తాజాగా నిఖిల్ ప్రమోషన్స్‌లో భాగంగా బిత్తిరి సత్తితో ఓ ఇంటర్వూ చేశారు. అందులో నిఖిల్, అనుపమ, దర్శకుడు చందూ మొండేటి పాల్గోన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా.. నిఖిల్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. . Photo : Twitter
నిఖిల్ ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ.. పుష్పక విమానం అప్పట్లో ఉందని.. అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తెలిపారు. అంతేకాదు బ్రహ్మాస్త్రం వాడాలన్న అప్పట్లో మంత్రం వాడేవారని.. అది వాయిస్ రికగ్నైజేషన్ పాస్ వర్డ్ అని... అప్పుడే ఆ ఆస్త్రం యాక్టివేట్ అవుతుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్స్ ట్రోల్ చేస్తూ.. నిఖిల్ వాట్సాప్ యూనివర్సీటి నుంచి ఈ విషయంలో పట్టా అందుకున్నారని అంటుంటే.. మరికొందరూ మాత్రం సెలెబ్రిటీస్ మాట్లాడేటప్పుడు కాస్తా ఆలోచించి మాట్లాడాలనీ సూచిస్తున్నారు.. ఏది ఏమైనా కార్తికేయ2 సినిమా మంచి వసూళ్లను రాబడుతుండడంతో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ ఖుషిలో ఉన్నారు. Photo : Twitter
ఇక కార్తికేయ 1 మంచి హిట్ అవ్వడంతో అదే సినిమాకు సీక్వెల్‌గా వస్తో్న్న కార్తికేయ 2కు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ అయ్యింది. ఈ సినిమా నైజాంలో 3.50 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో పాటు సీడెడ్: 1.8 కోట్లు, ఆంధ్రా: 6 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తంగా 11.30 కోట్లకు అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక కర్నాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.50 కోట్లు, ఓవర్సీస్ : 1.00 కోట్లుగా అమ్ముడు పోయిందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమాలో నిఖిల్‌తో పాటు అనుపమ (Anupama Parameshwaran), అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కమర్షియల్ విలువలు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మించాయి. కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్య పురం నేపథ్యంలో తెరకెక్కిస్తే.. కార్తికేయ 2 స్టోరీ శ్రీ కృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కించారు. Photo : Twitter
కమర్షియల్ విలువలు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మించాయి. ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆగష్టు 5కు పోస్ట్ పోన్ చేశారు. చివరకు ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. Photo : Twitter
కార్తికేయ 2 షూటింగ్ మొదలయ్యిన దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల్లో, సినిమా ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటించింది . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటించారు. అనుపమ్ ఖేర్.. అపుడెపుడో ‘త్రిమూర్తులు’ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి కార్తికేయ 2తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా ఈయన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకెక్కారు. Photo : Twitter