Niharika personal video: నిహారిక పెళ్లి సెట్టయింది మొదలు ఆమె వార్తల ప్రవాహం షురూ అయింది. జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ పర్సనల్ వీడియో వదిలి మరోసారి వార్తల్లోకెక్కింది నిహారిక.
ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ పై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా డాటర్ నిహారికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ వార్తల్లో నిలిచింది.
2/ 10
నిహారిక పెళ్లి సెట్టయింది మొదలు ఆమె వార్తల ప్రవాహం షురూ అయింది. జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాద్ పబ్ ఇష్యూలో పోలీసులకు పెట్టుబడి ట్రోల్స్ బారిన పడింది నిహారిక.
3/ 10
ఆ తర్వాత కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ మెగా డాటర్.. ఇప్పుడు క్రమంగా ఆన్ లైన్ మాద్యమాలపై తన హవా పెంచుతూ వస్తోంది. ఫోటోషూట్స్ పోస్ట్ చేయడంతో పాటు పలు వ్యక్తిగత విషయాలను నెటిజన్లతో పంచుకుంటోంది.
4/ 10
కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్న సమయంలోనే జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది నిహారిక. ఆ తర్వాత హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చింది. అప్పటి నుంచి తన అత్తారింట వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
5/ 10
ఈ క్రమంలోనే ఓ పర్సనల్ వీడియో వదిలి మరోసారి వార్తల్లోకెక్కింది నిహారిక. ఇంట్లోని సోఫాలో తన భర్త ఒడిలో పడుకొని ఉండగా తీసిన ఓ వీడియో క్లిప్‌ని తన ఇన్స్‌స్టా స్టోరీలో పెట్టుకుంది.
6/ 10
అయితే ఈ వీడియోలో నిహారిక కిస్ ఇస్తుండటం హైలైట్ అయింది. భర్త ఒడిలో పడుకొని ఇలా నిహారిక ఇస్తున్న కిస్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఆ వీడియో చూసేస్తున్నారు.
7/ 10
'ఒక మనసు' సినిమాతో కెరీర్ ఆరంభించిన నిహారిక.. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించినా కూడా అవేవీ ఆమె కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు. దీంతో నటన పరంగా వెనుకడుగేసి నిర్మాతగా సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది నిహారిక.
8/ 10
ఈ క్రమంలోనే హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ (Hello World Web Series) రూపొందించింది మెగా డాటర్ నిహారిక. త్వరలోనే జీ5లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ మూవీని బాగా ప్రమోట్ చేసుకుంటోంది. ఈ మేరకు పలు షోస్ అటెండ్ అవుతూ అల్లరల్లరి చేస్తోంది.
9/ 10
పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కొనసాగిస్తోంది నిహారిక. హీరోయిన్గా కెమెరా ముందుకు రాకపోయినప్పటికీ తన బ్యానర్లో వెబ్ సిరీస్‌లు మాత్రం నిర్మిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని విజయాలను కూడా అందుకుంది. నిర్మాతగా అయినా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని ఆరాటపడుతోంది.
10/ 10
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీ కావడంతో ఆరంభం నుంచే నిహారికకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే కెమెరా ముందు నటనతో మెస్మరైజ్ చేయడంలో కాస్త మార్కులు తక్కువే వేయించుకుంది ఈ మెగా డాటర్.