ఎర్ర చీర కట్టి పిల్లర్ వద్ద కూర్చొని నిహారిక ఇచ్చిన పోజులు చూసి కుర్రకారు ఫిదా అవుతోంది. కలర్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసింది నిహారిక. తనలోని అన్ని యాంగిల్స్ చూపిస్తూ కవ్వించింది. ఓ వైపు విడాకుల రూమర్స్ చెక్కర్లు కొడుతుండగా.. నిహారిక ఇలాంటి పిక్స్ షేర్ చేయడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు నెటిజన్లు.
రెండేళ్ల క్రితం గుంటూరుకి చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డని నిహారిక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తోంది. ఇంతలో రీసెంట్ గానే ఆమె విడాకుల రూమర్లు తెరపైకి వచ్చాయి. దీనికితోడు సోషల్ మీడియా మాధ్యమమైన ఇన్స్టాగ్రామ్లో ఈ ఇద్దరు ఒకనొకరు అన్ ఫాలో చేసుకోవడం పలు అనుమానాలు షురూ అయ్యాయి.
ఆ మధ్య నిహారిక- చైతన్య డివోర్స్ ఇష్యూ వైరల్ కాగా.. ఆ వార్తలకు కాస్త బ్రేక్ వచ్చినా మళ్లీ ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం నిహారిక, చైతన్య చేసిన పనులే. దీంతో ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో మరోసారి దుమారం రేగింది.