మెగా డాటర్ నిహారిక గతేడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ కుమారుడైన చైతన్య.. ప్రస్తుతం ఓ పేరు మోసిన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్‌కు కొన్ని రోజులు మాల్దీవ్స్ దీవులకు వెళ్లారు. అక్కడ వారి మధుర క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పంచుకుంటూ నిహారిక మరింత పాపులర్ అయ్యారు. Photo : Instagram
ఇక అది అలా ఉంటే ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి మరోసారి వెకేషన్‌ను వెళ్లారు. ఈ సారి జోర్డాన్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన నిహారిక తన భర్తతో కలిసి ఫోటోలను దిగుతూ.. వాటిని పంచుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే ప్రస్తుతం జోర్డాన్ ట్రిప్‌లో ఉన్న నిహారికకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram
దీంతో మరోసారి నెటిజన్స్, ట్రోలర్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆమె వివాదాల్లో ఇరుక్కున్న నిహారిక మరోసారి ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడిది అవసరమా నిహారిక అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. Photo : Instagram
ఇక మరోవైపు ఆ ఫోటోల్లో తప్పు ఏముందని అంటున్నారు కొందరు నెటిజన్స్. తమ భార్య భర్తల బంధం ఎంత బలంగా ఉందో చెప్పేందుకు నిహారిక ఇలా చేసి ఉండోచ్చని, భార్యభర్తలు ఫోటోలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఈ ఫోటోలు నిహారిక సొంత అకౌంట్ కాకుండా.. ఆమె ఫ్యాన్ అకౌంట్ నుంచి వైరల్ అవుతున్నాయి. Photo : Instagram
ఇక మరోవైపు ఆ ఫోటోల్లో తప్పు ఏముందని అంటున్నారు కొందరు నెటిజన్స్. తమ భార్య భర్తల బంధం ఎంత బలంగా ఉందో చెప్పేందుకు నిహారిక ఇలా చేసి ఉండోచ్చని, భార్యభర్తలు ఫోటోలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఈ ఫోటోలు నిహారిక సొంత అకౌంట్ కాకుండా.. ఆమె ఫ్యాన్ అకౌంట్ నుంచి వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. Photo : Instagram
ఆమె ప్రస్తుతం నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యారు. ఆమె నిర్మించిన వెబ్ సిరీస్‌లు మంచి ఆదరణ పొందాయి. ఇక నిహారిక ఓ వైపు నిర్మాత రాణిస్తూనే.. ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో కనిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ పబ్‌లో కొందరు డ్రగ్స్ వాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. Photo : Instagram
దీంతో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి సినీ ప్రముఖులను అరెస్ట్ చేసి, ఆ తర్వాత వదిలేశారు. అయితే ఆ పబ్‌లో డ్రగ్స్ వాడకం జరుగుతున్ననేపథ్యంలో నిహారికపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీన్ని నాగబాబు ఖండించారు. నిహారిక క్లీయర్‌గా ఉందన్నారు. అంతేకాదు ఆమెకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కూడా వదిలేశారు. Photo : Instagram
నిహారిక కొణిదెల పర్సనల్ విషయాలకు వస్తే.. ఆమె 18 డిసెంబర్ 1993న జన్మించారు. నటిగానే కాకుండా టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా కొన్నాళ్లు అలరించారు. ఇక ఆమె ఒక మనసు (2016) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఆమె "పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్" బ్యానర్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లను కూడా నిర్మిస్తున్నారు. Photo : Instagram
ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో ముద్దపప్పు ఆవకాయ్ అనే తెలుగు వెబ్-సిరీస్‌ను నటించారు. అంతేకాదు ఆ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్‌లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక పెళ్లి తర్వాత నిహారిక ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇది కూడా మంచి ఆదరణ పొందింది. Photo : Instagram