తన ఇన్స్‌స్టాగ్రామ్ స్టోరీలో కాళ భైరవతో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టిన నిహారిక.. నువ్వంటే నాకు ఎంతిష్టమో నీకు తెలుసని అనుకుంటున్నా. నా అవసరాల్లో నాకు నాకు తోడుగా ఉంటూ వస్తున్నందుకు థాంక్స్. ఐ లవ్యూ.. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి.. నీ అద్భుతమైన గాత్రంతో ఇంకా ఎన్నో పాటలు పాడాలి. ఎంతో మంచి సంగీతం అందించాలి అని పేర్కొంది.
'ఒక మనసు' సినిమాతో కెరీర్ ఆరంభించిన నిహారిక.. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించినా కూడా అవేవీ ఆమె కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు. దీంతో నటన పరంగా వెనుకడుగేసి నిర్మాతగా సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ (Hello World Web Series) రూపొందించింది మెగా డాటర్.