Niharika: పవన్ కళ్యాణ్‌పై నిహారిక కామెంట్స్ వైరల్.. ఆ ఒక్క మాటతో నెట్టింట రచ్చ రచ్చ
Niharika: పవన్ కళ్యాణ్‌పై నిహారిక కామెంట్స్ వైరల్.. ఆ ఒక్క మాటతో నెట్టింట రచ్చ రచ్చ
Pawan Kalyan Niharika: సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ పరంగా తన మార్క్ చూపెడుతున్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా ఆయన వెళుతున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు జనాల్లో డిస్కషన్ పాయింట్ అవుతున్నాయి. ఇన్నిరోజులు సినిమాపై ఫోకస్ పెట్టిన పవర్ స్టార్.. ఇప్పుడు రాజకీయం వైపు వేగంగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై నిహారిక రియాక్ట్ అయింది.
ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. తాను కమిటైన సినిమా చేసుకుంటూ పోతూనే రాజకీయాల పరంగా వ్యూహాత్మక అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
2/ 9
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ పరంగా తన మార్క్ చూపెడుతున్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా ఆయన వెళుతున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు జనాల్లో డిస్కషన్ పాయింట్ అవుతున్నాయి. ఇన్నిరోజులు సినిమాపై ఫోకస్ పెట్టిన పవర్ స్టార్.. ఇప్పుడు రాజకీయం వైపు వేగంగా అడుగులేస్తున్నారు.
3/ 9
అధికారంలో లేకపోయినా కూడా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేలా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నేనున్నా అంటున్నారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్.
4/ 9
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పూనుకున్నారు పవన్ కళ్యాణ్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం మొదలుపెట్టి విరాళాలు సేకరిస్తున్నారు.
5/ 9
అయితే ఈ విరాళాల సేకరణలో మెగా ఫ్యామిలీ భాగమైంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ 10 లక్షల రూపాయలు ఇవ్వగా, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 10 లక్షల సాయం ప్రకటించారు. అలాగే వైష్ణవ్ తేజ్ 5 లక్షలు, నిహారిక 5 లక్షల విరాళాలు ప్రకటించారు. ఇలా మొత్తంగా మెగా ఫ్యామిలీ నుండి 35 లక్షల రూపాయల విరాళం అందింది.
6/ 9
ఈ విరాళాలు అందించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన పవన్.. ''ఎప్పుడూ రాజకీయాల వైపు చూడని వారు కౌలు రైతుల కష్టాలు చూసి వారి బిడ్డల భవిష్యత్తు కోసం 35 లక్షల విరాళం అందించిన అందరికీ పేరు పేరున జనసేన, జన సైనికులు, వీరమహిళలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను'' అని పేర్కొన్నారు.
7/ 9
దీంతో పవన్ చేసిన ఈ ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ నిహారిక స్పందించింది. ''కళ్యాణ్ బాబాయ్ చాలా థాంక్స్. ప్రజలకు సహాయం చేయడానికి మాకు కూడా కొంత అవకాశం ఇచ్చారు. నేను ఎల్లప్పుడూ ఎదురుచూసే ఒక మంచి నాయకుడు మీరు. మీతోనే జనానికి మంచి రోజులొస్తాయని నమ్ముతున్నా'' అని నిహారిక పేర్కొంది.
8/ 9
ఇక నిహారిక పెట్టిన ఈ ట్వీట్ చూసి జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మెగా అభిమానులు మురిసిపోతుండగా.. కొంతమంది నెటిజన్స్ ఎదురుదాడి చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని, నిహారికకు టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
9/ 9
ఇంకొందరు నెటిజన్స్ ఏకంగా నిహారిక పబ్ ఇష్యూ బయటకు తీస్తూ ఏపీలో ఓ పబ్ కట్టించరాదు అంటూ ఆమెపై అటాక్ చేస్తున్నారు. అయితే నిహారికపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌ని మెగా ఫ్యాన్స్ తిప్పికొడుతుండటంతో నెట్టింట రచ్చ షురూ అయింది.