Niharika Konidela : నిహారిక కొణిదెల కాదు కాదు నిహారిక జొన్నలగడ్డ ఇటు డిజిటల్‌లోను రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. 'ఒక మనసు' 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ మెగా డాటర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్గా ర్యాడిసన్ క్లబ్ పై దాడి ఘటనలో మరోసారి వార్తల్లో నిలిచింది.
చైతన్య జొన్నలగడ్డతో మ్యారేజ్ తర్వాత నటనకు దాదాపు గుడ్ బై చెప్పినట్టు రీసెంట్గా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదగా షోలో వ్యాఖ్యానించింది. అంతేకాదు తన భర్తకు తాను సినిమాల్లో నటించడమంటే ఇష్టం లేదు అంటూ కుండ బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ భామ కేవలం నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. తాజాగా నిహారిక మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. (Instagram/Photo)
అంతేకాదు హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై తాజాగా ఈమె కుటుంబ సభ్యులు ఆమెకు పర్మిషన్ కూడా ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై నిహారిక అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (Image Credit : Instagram)
ఇక చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులో ఎవరు అంటే నీకు ఎక్కువ ఇష్టం అంటే.. మరో ఆలోచన లేకుండా తన తండ్రి పేరు చెప్పి కూతురు ప్రేమ చాటుకుంది నిహారిక. ప్రపంచంలో ఎవరికైనా తండ్రి తర్వాత ఇంకెవరైనా అంటూ సమాధానమిచ్చింది.మొత్తంగా నిహారిక త్వరలో ముఖానికి రంగేసుకోవడంపై మరోసారి వార్తల్లోకి వచ్చింది. (Image Credit : Instagram)