Nidhhi Agerwal: నక్క తోక తొక్కిన నిధి అగర్వాల్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఇస్మార్ట్ పోరి..

Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. ఇపుడు పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు రామ్ చరణ్, శంకర్ సినిమాలో కూడా ఈమె పేరునే పరిశీలిస్తున్నట్టు సమాచారం.