Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తెలుగులో పెద్ద, చిన్నా తేడా లేకుండా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అందరి హీరోల సరసన నటించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ముఖ్యంగా ఈ యేడాది పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.
తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా నిధి ముందుకు వస్తున్నాయి. ప్రతీ సినిమాకు కూడా కోటికి పైగానే డిమాండ్ చేస్తుంది నిధి. ప్రస్తుతం ఈమె తమిళ హీరో శింబుతో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్స్తో నిధి మామూలు జోరు చూపించడం లేదు. రేపు పవన్ సినిమా కానీ విజయం సాధిస్తే మాత్రం ఈమె రచ్చ మామూలుగా ఉండదు.(nidhhi agerwal hot photos/instagram)