ముంబై మోడల్‌గా పనిచేసి ఈ భామ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో హీరోయిన్గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది నిధి. అయితే ప్రస్తుతం ఈ భామకు అనుకున్న రేంజ్లో అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో ప్రముఖ సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామితో రాజశ్యామల పూజ చేయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Instagram
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వేణు స్వామి ముఖ్యంగా సినీ నటుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో బాగాపాపులర్ అయ్యాడు. ప్రభాస్, రష్మిక మందన్న ఇలా ప్రముఖుల జాతకాలు చెప్పడంతో తన జ్యోతిష్యం పట్ల క్రేజ్ ఓ రేంజ్లో వచ్చింది. దీంతో ఇటీవలి కాలంలో వేణుస్వామి పేరు బాగా వైరల్ అవుతోంది. Photo : Instagram
సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. ఆమధ్య మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమైన ‘హీరో’ మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. Photo : Instagram
నిధి అగర్వాల్ తెలుగులో పెద్ద, చిన్నా తేడా లేకుండా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అందరి హీరోల సరసన నటించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. Photo : Instagram
తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా నిధి ముందుకు వస్తున్నాయి. ప్రతీ సినిమాకు కూడా కోటికి పైగానే డిమాండ్ చేస్తుంది నిధి. ప్రస్తుతం ఈమె తమిళ హీరో శింబుతో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్స్‌తో నిధి మామూలు జోరు చూపించడం లేదు. రేపు పవన్ సినిమా కానీ విజయం సాధిస్తే మాత్రం ఈమె రచ్చ మామూలుగా ఉండదు.Photo : Instagram
కెరీర్ మొదట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ.. తన తొలి ప్రేమ, ఫస్ట్ డేట్, కాబోయే వరుడు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.. ఈ సందర్భంగా నిధి తను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు తన స్నేహితుడిపై క్రష్ ఉండేదని. అయితే అది ఆకర్షణ మాత్రమే అని తర్వాత అర్థమైందని. ఆ అబ్బాయి ఇప్పటికీ మంచి స్నేహితుడిగా ఉన్నాడు అంటూ చెప్పింది. Photo : Instagram
అయితే కొంచెం పెద్దయ్యాక ఓ అబ్బాయితో డేట్‌కు వెళ్లానని. తనకు తొలి వాలంటైన్ ప్రపోజ్ కూడా తన నుంచే అందిందదని. ఇంకో విశేషం ఏంటంటే.. అదే రోజు అతని పుట్టినరోజు కూడా అంటూ తెలిపింది నిధి. హీరోల్లో ఫస్ట్ క్రష్ మాత్రం షారఖ్ ఖాన్పైనే అని ఈ సందర్భంగా తెలిపింది నిధి. నిధి అగర్వాల్ 17 ఆగష్టు 1992లో హైదారాబాద్‌లో జన్మించింది. అంతేకాదు బెంగళూరుకు చెందిన క్రైస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. (Photo : Instagram