అక్టోబర్ 15 తర్వాత నుంచి సినిమా ధియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, అందుకు కొన్ని మార్గదర్శకాలు విధించింది. ఆ నిబంధనల ప్రకారం సినిమా ధియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు. సినీ జనం అభిప్రాయాలు తెలుసుకునేందుకు నెట్వర్క్ 18 ప్రయత్నించింది. PublicSentimeterపేరుతో నెట్వర్క్ 18 సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో సర్వే చేసింది.
ధియేటర్లో కూర్చుని ఎప్పుడు సినిమా చూస్తారని ప్రశ్నించగా, సర్వేలో పాల్గొన్న 50.28 శాతం మంది కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే తాము ధియేటర్ల ముఖం చూస్తామని స్పష్టం చేశారు. ధియేటర్లు ఓపెన్ అవ్వగానే వెళ్తామని 14.05 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎప్పటికీ ధియేటర్లో కూర్చుని సినిమా చూస్తామనుకోవడం లేదని 10.02 శాతం మంది చెప్పారు.