అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో.. ఇప్పుడు దాని సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 మూవీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా తెలుగులోనే కాదు.. రిలీజైన అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది.
ఈ సినిమా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ కొత్త క్యారెక్టర్ ద్వారా.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్ ‘ పుష్ప 3’ కి లీడ్ అవుతుందని తెలుస్తోంది. మరీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ వార్త మాత్రం బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటి అనే విషయంపై ఆరా తీస్తున్నారు పుష్ప అభిమానులు.
అల్లు ఫ్యామిలీ గండిపేట సమీపంలో ఓ పది ఎకరాల్లో కొత్తగా ఓ స్టూడియోను నిర్మించారు. ఇటీవలే ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి ప్రారంబించిన విషయం తెలిసిందే. ఈ స్టూడియోలో పుష్ప2 షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఈమూవీ కథలో ఇప్పటికే అనేక మార్పులు చేసిన సుకుమార్ ఈమూవీని సహజత్వం కోసం బ్యాంకాక్ ఫారెస్ట్ లోను అదేవిధంగా కెన్యా పర్వతాల పైనా ఈమూవీ షూటింగ్ ను తీయాలని సుకుమార్ భావించినట్లు తెలుస్తోంది.
దీంతో ‘పుష్ప 2’ మరింత ఆలస్యం కాకూడదని అల్లు స్టూడియోస్ లో బ్యాంకాక్ అరణ్యాన్ని పోలినట్లుగా ఒక దట్టమైన కృత్రిమ అడవిని కెన్యా పర్వతాలను పోలినట్లుగా కృత్రిమ పర్వతాల సెట్ ను సుకుమార్ డిజైన్ చేయిస్తున్నట్లు టాక్. ఇక పుష్ప 2 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి రూ. 50 కోట్లు తీసుకున్న బన్నీ.. రెండో భాగానికి రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి, అటు సుకుమార్ కూడా తన ఫీజు బాగానే తీసుకుంటున్నాడని సమాచారం.
ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగించి 6 నెలలలో ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది దసరా కు ఈమూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదలచేయాలని సుకుమార్ ప్లాన్ అని అంటున్నారు. ప్పటికే పుష్ప పది భాషాల్లో విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. . తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు కలిపి మొత్తం పది భాషాల్లో పుష్ప 2 (Pushpa 2) సినిమా రాబోతుంది. మరోవైపు ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.