తెలుగు టాప్ హీరోయిన్స్‌లలో ఒకరు సమంత. ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో పాటు తెలుగులో ఓ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా ఆమె ప్రధాన పాత్రల్లో యశోద, శాకుంతలం అనే సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలు ఇప్పటికే షూటింగ్’ను పూర్తి చేసుకున్నాయి. ఇక అది అలా ఉంటే సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సినిమాలను మరింత దూకుడుగా ఉన్నారు. అంతే దూకుడుగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాదు ఎప్పుడు లేని విధంగా మరింతగా బోల్డ్ ఫోటోషూట్లను చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. Photo : Instagram
ఈ క్రమంలోనే సమంత ఇటీవల తనను ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయంలో కొందరూ ఆమెను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సమంత వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ఆమె అంటే నచ్చని కొందరూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అయితే సమంతపై ఉన్న ఈ వ్యతిరేకత.. ఆమె నటించిన సినిమాలపై ప్రభావ చూపే అవకాశం ఉండోచ్చని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్రల్లో వస్తున్న యశోద, శాకుంతలం సినిమాలపై ఉండోచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు దాదాపుగా వంద కోట్ల బడ్జెట్‌తో వస్తుండడంతో నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో సమంత తీరు పట్ల కాస్తా ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే సమంత ఆస్తుల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లకు ఉంటాయి.. ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు సమంత ఒక్కో సినిమాకు రెండు నుండి మూడు కోట్లు తీసుకుంటుందని అంటున్నారు. అంతేకాదు సమంత తన పదేళ్ల కెరీర్ లో మొత్తం రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులు సంపాదించిందని టాక్. Photo : Instagram
ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాడ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ సమంత అదరగొడుతున్నారు. సమంతకు సొంతంగా రెండు బిజినెస్‌లు కూడా ఉన్నాయి. ఒకటి ఫ్యాషన్ లేబుల్ సాకి కాగా.. మరొకటి ఎకాం అనే ప్రీ స్కూల్. పిల్లలకు వినూత్నంగా విద్యను అందించే లక్ష్యంతో కొన్ని సంస్థలతో కలిసి ఈ సంస్థను మొదలుపెట్టారు. Photo : Instagram
వీటితో పాటు సమంతకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక విలాసవంతమైన ఇల్లుతో పాటు రెండు కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కార్లు రెండు ఉన్నాయని తెలుస్తోంది. అలానే ఒక జాగ్వార్ కారు కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా సమంత సొంతంగా సంపాదించుకున్న ఆస్తులే. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.., ఆమె నయనతార కలిసి నటించిన తాజా చిత్రం కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలై ఓకే అనిపించుకుంది. Photo : Instagram
ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా (Kanmani Rambo Khatija) డబ్ చేశారు. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తెలుగులో ప్రమోషన్స్ సరిగా చేయలేకపోవడంతో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా థియేటర్స్ నుంచి వెళ్లి పోయింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. Photo : Twitter
అది అలా ఉంటే ఈ సినిమా మే 27 నుంచి అంటే ఈరోజు నుంచి హాట్ స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్లో ఈ సినిమా హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక సమంత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ప్రారంభం అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు. ప్రేమకథ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మైత్రీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహబ్ అనే మలయాళీ సంగీత దర్శకత్వం వహించనున్నారు. Photo : Twitter
సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. Photo : Twitter
తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండVijay Devarakonda)తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెచ్యూర్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ అప్ డేట్ వచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టీమ్ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఖుషి (Kushi) అంటూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్‌తో చేస్తున్న ఖుషి సినిమాలో సమంత నటిస్తున్నందుకు సమంతకు భారీగా రెమ్యూనరేషన్ దక్కినట్లు తెలుస్తోంది. సమంత సాధారణ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే 25% ఎక్కువ ఈ సినిమా కోసం నిర్మాతలు చెల్లిస్తున్నారట. దీనికి కారణం సమంతకు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉండడంతో పాటు తనకు మంచి మార్కెట్ ఉన్న కారణంగా నిర్మాతలు అంత మొత్తం చెల్లించడానికి రెడీ అయ్యారట. ఇక ఈ సినిమాకు హషీమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే సమంతకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ఒక్కసారిగా ఇటు సౌత్ నుంచే కాకుండే అటు నార్త్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దీనికి తోడు పుష్ప(Pushpa)లో ఐటెమ్ సాంగ్ వల్ల ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది నార్త్‌లో.. అందులో భాగంగా పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే నార్త్ నుంచి ఆమెకు పలు ఆఫర్స్ వచ్చిన వాటిని ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. Photo : Twitter
ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ తెలుగు సినిమాలపైనే ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే.. హిందీ నుండి వస్తోన్న ఆఫర్స్ అన్ని కూడా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే అవకాశాలు వచ్చాయట. దీంతో ఆ ఆఫర్స్‌ను కాదంటూ.. సున్నితంగా నో చెప్పిందట. ఇక ఈ వార్త తెలుసుకున్న సమంత అభిమానులు మాత్రం మా అభిమాన నటికి సెకండ్ హీరోయిన్గా అవకాశం ఇస్తారా.. అంటూ ఇది ఓరకంగా అవమానమే అంటూ ఫీల్ అవుతున్నారట. Photo : Twitter
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో కేక పెట్టిస్తున్నారు. అంతేకాదు వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే... మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగా ఆమె తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి సమంత చేసుంటారని నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు. Photo : Twitter
ఇక సమంత పెట్టిన పోస్ట్ విషయానికి వస్తే.. నిజాలు ఎప్పుడూ అరుదుగా బయటకు వస్తాయి. కానీ అబద్ధాలకే వేగంగా ప్రచారం వస్తుంది. అబద్ధాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుందంటూ సమంత ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో రాసుకున్నారు. దీంతో బహుశా గతంలో కొందరు చేసిన పనులు గుర్తు వచ్చి ఆమె ఈ పోస్ట్ చేసి ఉంటారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన తాజా సినిమా కన్మణీ రాంబో ఖతీజా తాజాగా విడుదలై ఓకే అనిపించుకుంది. మరోవైపు తాజాగా ఆమె నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. Photo : Twitter
Samantha Ruth Prabhu : సమంత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నటిగా సమంత.. రీసెంట్గా 12 యేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ పన్నెండు ఏళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. Photo : Twitter
సమంత మొదటి తెలుగు సినిమా.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’ ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి..ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి. ఆ సినిమా బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ‘బృందావనం’లో ఇందుగా.. గ్లామర్ పాత్రలో మెరిసారు సమంత. ఆ తర్వాత మహేష్ బాబు ‘దూకుడు’లో మోడల్ ప్రశాంతిగా మెప్పించారు. తెలుగులో కాదు.. ఆ తర్వాత తమిళ సినిమాల్లో హీరోయిన్గా సత్తా చాటారు సమంత. హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉండగానే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా వీరి పెళ్లి బంధం కొన్నాళ్ల వరకేసాగింది. (Twitter/Photo)
ఇక అది అలా ఉంటే చాలా మందికి సమంత అక్కినేని సినిమాల గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుసు కానీ.. ఆమె పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. సమంత అక్కినేని నాన్న వాళ్ల ప్రభు తెలుగు వాళ్లు. వాళ్ల అమ్మ నివెట్ ది మాత్రం కేరళ. కానీ సమంత వాళ్ల ఫ్యామిలీ మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు. Photo : Twitter
సమంత వాళ్ల అమ్మా నాన్నలకు జోనాథన్, డేవిడ్ తర్వాత సమంత మూడో సంతానం. కుటుంబంలో ఈమె చిన్నది కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. సమంత అక్కినేని బాల్యం, విద్యాభ్యాసం మొత్తం చెన్నైలో జరిగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేసారు సమంత. ఆ టైమ్‌లోనే ప్రముఖ దర్శకుడు రవి వర్మన్ తను తీయబోయే తమిళ సినిమా ‘మాస్కోవిన్ కావేరి’లో హీరోయిన్గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. (Twitter/Photo)
తమిళంలో ఆ సినిమా కంటే ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏమాయ చేసావే’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సమంత కథానాయికగా వెనుదిరిగి చూసుకోలేదు. సమంత ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ తో పాటు సాకీ పేరుతో దుస్తుల బ్రాండ్‌ను స్టార్ట్ చేసింది. దాంతో పాటు ‘ఆహా’లో సామ్ జామ్ అంటూ యాంకర్ అవతారం కూడా ఎత్తారు సమంత. మరోవైపు సమంత ఓ NGOను నడుపుతున్నారు. ప్రత్యూష సపోర్ట్ అనే సంస్థను నడుపుతూ ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తన వంతుగా సాయం చేస్తూనే ఉంది. ఈ ప్రత్యూష సపోర్టు ద్వారా గుండె జబ్బులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. వీటితో పాటు ప్రాణాపాయ వ్యాధులకు కూడా ప్రత్యూష సపోర్టు ద్వారా వైద్యం అందిస్తున్నారు.ఈ లక్షణం, సామాజిక అంశాల పట్ల సోయి అందరిలో చూడలేం. Photo : Twitter
ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ (Gunasekhar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. Photo : Twitter
ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha Ruth Prabhu )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. Photo : Twitter