తాజాగా వీర సింహా రెడ్డి నుండి తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య రిలీజైంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి మాస్ పాట జైబాలయ్యను (Jai Balayya Mass Anthem Lyric) వదిలింది టీమ్. జై బాలయ్య అనే టైటిల్‌తో రూపొందిన ఈ పాటలో థమన్ (Thaman S) ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చారు.Jai Balayya Song (Photo Twitter)
బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13 లేదా 14న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్‌గా మరోసారి ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్టు సమాచారం. చెన్నకేశవరెడ్డి తరహా తండ్రీ కొడుకులుగా మరోసారి అదరగొట్టనున్నారు. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు అని చెబుతున్నారు. మరోవైపు సాధువు పాత్రలో కూడా నటించబోతున్నట్టు కూడా చెబుతున్నారు. Photo : Twitter