బుల్లితెరపై నటిగా, హోస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్‌లను నిర్మించింది. హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్గా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో డిజిటల్, బుల్లి తెరపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది.
పబ్ ఘటనతో నిహారికపై కొందరు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు.అయితే ఆమె మాత్రం ఇలాంటివి ఏం పట్టించుకోనని ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ చెప్పింది. అసలు ఇన్‌స్టాలో నెటిజన్స్ పెట్టే కామెంట్స్ ఏ మాత్రం చదవనని చెప్పింది నిహారిక. సో ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్న లైట్ తీసుకుంటానంది మెగా డాటర్