బుల్లితెరపై మల్లెమాల షోలకు ఉండే డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. మల్లెమాల చేసే షోలన్నీ హిట్ అవుతూనే ఉంటాయి. ఈటీవీలో మల్లెమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 27 ఏళ్ల ఈటీవీ జర్నలో మల్లెమాలకు ప్రత్యేక భూమిక పోషిస్తుంది. అలాంటి మల్లెమాల ఈ మధ్య కొన్ని షోలు, కొన్ని ఈవెంట్లలో దారుణంగా ప్రవర్తిస్తోంది. కొన్ని సార్లు హద్దులు దాటుతున్నట్టు కనిపిస్తోంది. మాములుగా అయితే ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ఈవెంట్ చేస్తుంటుంది మల్లెమాల టీం. అలా ఈ వినాయక చవితికి కూడా ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.
మల్లెమాల ప్రస్తుతం వరుసగా షోలను చేస్తోంది. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇలా అన్ని షోలను ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. మల్లెమాల, శ్యాం ప్రసాద్ రెడ్డిని నిలబెట్టింది ఢీ షో. ఇప్పటికీ ఆ షోకు మంచి ఆదరణ ఉంది. మల్లెమాల ఆదాయాన్ని జబర్దస్త్ షో భారీగా పెంచేసింది. అలా ఇప్పుడు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్రాండ్‌గా మారింది.
కొత్త కొత్త షోలను ఇంట్రడ్యూస్ చేస్తోంది. జాతి రత్నాలు అనే స్టాండప్ కామెడీ షోను కూడా మొదలుపెట్టేసింది. ఇక పండుగలకు చేసే ప్రత్యేక ఈవెంట్లు, అందులోని కొత్త కొత్త కాన్సెప్టులు అందరినీ మెప్పిస్తుంటాయి. సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా అన్ని పండుగలకు ప్రత్యేక ఈవెంట్లు చేస్తుంటుంది. తమ ఆర్టిస్టులతో ఎంటర్టైన్ చేసేందుకు ముందుకు వస్తుంది.