ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఏడుగురి సంగతేమో కానీ.. టిక్‌టాక్‌పై మన దేశంలో నిషేధం విధించక ముందు కొందరి వీడియోలు చూస్తే ఏడుగురుంటారో, లేదో గానీ కాస్తంత దగ్గర పోలికలతో ఒకరిద్దరూ ఉంటారని అనిపించక మానదు. ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్.. ఈ హీరోలకు చాలా దగ్గర పోలికలున్న కొందరు టిక్‌టాక్‌లో వీడియోలు చేసి బాగానే ఫేమస్ అయ్యారు.