Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సీరియల్స్ లో నటిస్తున్న వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. వంటలక్క అంటే చాలు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక అలాంటి వంటలక్క ఒక ఫోటో పెడితే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక అలానే కొద్దిరోజులు క్రితం 2 చేతులూ చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది వంటలక్క. అది చుసిన అభిమానుల్లో ఒకరు ఓ కోరిక కోరారు. అది ఏంటంటే చేతులకు గోరింటాకు పెట్టుకొని ఫోటో పెట్టాలని కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ కు వంటలక్క ఇప్పటి వరకు స్పందించలేదు కానీ.. ఆ కామెంట్ మాత్రం వైరల్ అవుతుంది.