Negative Talk To Hit : గత కొన్నేళ్లుగా ఏ సినిమా కైనా బ్యాడ్ టాక్ రావడం కామన్‌గా జరుగుతూ ఉంటోంది. కొన్ని సార్లు సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్న సినిమాలున్నాయి. గతేడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.తాజాగా రవితేజ ‘ధమాకా’ కూడా నెగిటివ్ టాక్‌తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. (Twittter/Photo)
బంగార్రాజు | అక్కినేని తండ్రీ తనయులైన నాగార్జున, నాగ చైతన్య మరోసారి కలిసి నటించిన మూవీ ‘బంగార్రాజు’. ఈ సినిమాకు ముందుగా నెగిటివ్ టాక్ వచ్చినా.. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. ఈ సినిమాలో చైతూ కొత్త రికార్డు క్రియేట్ చేసాడు. మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు రూ. 50 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలున్న హీరోగా చరిత్ర సృష్టించాడు. సెకండ్ టైర్ హీరోలలో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు. కానీ అక్కినేని పెద్దోడు చేసి చూపించాడు.
పుష్ప | అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ఫ’. ఈ సినిమాకు ముందుగా నెగిటివ్ టాక్ వచ్చినా.. ఓవరాల్‌గా హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా నార్త్ రీజియన్‌లో ఈ సినిమా ఇరగదీసింది. ఇక నైజాంలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఏపీలో ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు. (Twitter/Photo)
నాన్నకు ప్రేమతో: జూనియర్ ఎన్టీఆర్ 25వ సినిమాగా విడుదలైన నాన్నకు ప్రేమతోకు తొలిరోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. సుకుమార్ మరోసారి అర్థం కాని సినిమా చేసాడంటూ ఫ్యాన్స్ కూడా తిట్టుకున్నారు. కానీ అదే టాక్‌తో ఎన్టీఆర్ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. చివరికి 54 కోట్ల షేర్ వసూలు హిట్ అనిపించుకుంది. (Twitter/Photo)