కొచ్చి : మలయాళంలో విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ND ప్రసాద్ ఒకరు. ఈయన ఈ నెల 25న తన ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంపై మలయాళ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. (File/Photo)
ND ప్రసాద్ చెట్టుకు ఉరి వేసుకోవడాన్ని ముందుగా ఈయన భార్య, ఇద్దరు పిల్లలే చూసారు. జరిగిన సంఘటనతో ఏం చేయాలో పాలు పోక పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలే ఈయన ఆత్మహత్యకు ప్రేరేపించనట్టు సమాచారం. దాంతో పాటు ఈయనకు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన భార్య కూడా గత కొన్ని నెలలుగా ఈయనకు దూరంగా ఉంటోంది. భార్య, కుటుంబ సభ్యులు దూరం కావడంతో డిప్రెషన్‌కు గురైన ఇతను ఈ సంఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. (File/Photo)
పోలీసులు మాత్రం ఈయన బంధులు, మిత్రులను కలిసి ఈయన మృతి పై ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈయన మానసిక పరిస్థితి ఎలా ఉందనే దానిపైనే పోలీసులు దృష్టి సారించారు.ఈయన ’యాక్షన్ హీరో బిజు’తో పాటు ‘ఇబా’, కర్మాణి’ వంటి చిత్రాల్లో నటించారు. ఇక నటుడిగా ఈయనకు 2016లో విడుదలైన ’యాక్షన్ హీరో బిజు’ నటుడిగా స్టార్డమ్ తీసుకొచ్చింది. (File/Photo)
పోలీసులు కథనం ప్రకారం ప్రసాద్ పై పలు క్రిమినల్ నేరారోపణలున్నాయి. అందులో ముఖ్యంగా డ్రగ్స్‌కు సంబంధించిన కేసు కీలకం. గతంలో ఈయన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు డ్రగ్స్ ఉపయోగిస్తుండగా ఈయన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పుడు ఈయన దగ్గర 2.5 గ్రాములు Hashish Oil and 15 గ్రాముల గంజాయి పట్టుపడింది. ఇక పోలసులు పోస్ట్‌మార్టమ్ తర్వాత అతన్ని పార్ధివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. (File/Photo)