Balakrishna | ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను డిసెంబ్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు.(Twitter/Photo)
బాలకృష్ణతో చేయబోయే సినిమాను గోపీచంద్ మలినేని తనదైన యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌కు రియలిస్టిక్ స్టోరీతో పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.. ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘వేట పాలెం’ లేదా ‘జై బాలయ్య’ టైటిల్స్ పరిశీలిస్తున్నారు. (Twitter/Photo)
గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్టు అభిమానులతో బాలయ్య కన్ఫామ్ చేసారు. గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించారు. (Twitter/Photo)
ఇక బాలయ్య కూడా పూరీతో సినిమా అంటే చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు. విజయ్ దేవరకొండ తో చేస్తోన్న లైగర్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. రీసెంట్గా గోవాలో పూరీ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక బాలయ్య పూరీ లైగర్‌లో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. Balakrishna in Liger sets Photo : Twitter
అటు బాలయ్య, కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక వేళ వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు పండగే. ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఆచార్య సినిమా చేసారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ చేయనున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరి సినిమా ఉండే అవకాశం ఉంది. (Twitter/Photo)
సింగీతం సినీ జైత్రయాత్రలో మరో మజీలీ ‘ఆదిత్య 369’. బాలకృష్ణ హీరోగా, భారతీయ తెరపై తొలి టైం మిషన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సీక్వెల్‌కు బాలయ్య కథను రెడీ చేసుకోవడంతో పాటు తన తనయుడుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బాలయ్య డైరెక్ట్ చే సే అవకాశాలున్నాయి. ఇందులో నట సింహం తన తనయుడుతో కలిసి నటించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. (Twitter/Photo)
మరోవైపు బాలకృష్ణ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేసేది మాత్రం చెప్పలేదు. ఈ సినిమా హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో తెరకెక్కుతుందా.. లేదా సితార ఎంటర్ట్మెంట్లో సెట్స్ పైకి వెళ్లనుందా అనేది చూడాలి. ఒకవేళ హారికా అండ్ హాసిని అంటే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. (Twitter/Photo)