NBK - Sankranthi Movies: తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ పూట తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్ కమింగ్ హీరోల వరకు అందరు ఉవ్విళూరుతారు. ఇక సంక్రాంతి సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా బాలయ్యకు ట్రాక్ రికార్డు ఉంది. (Photo Twitter)
1.వేములవాడ భీమకవి | 1976 జనవరి 8 న విడుదలైన వేములవాడ భీమకవి సినిమా బాలయ్యకు తొలి సంక్రాంతి సినిమా. ఎన్టీఆర్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాకు దాసరి యోగానంద్ దర్శకత్వం వహించారు. బాలయ్య టైటిల్ పాత్రలో వేములవాడ భీమకవిగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది. (Twitter/Photo)
2.దాన వీర శూర కర్ణ | 1977 జనవరి 14న విడుదలైన ‘దాన వీర శూర కర్ణ’ సినిమా విషయానికొస్తే.. ఇందులో బాలకృష్ణ సెకండ్ హీరోగా అభిమన్యుడిగా నటించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నగారు శ్రీకృష్ణుడిగా.. దుర్యోధనుడిగా.. కర్ణుడిగా మూడు విభిన్నపాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను బాలయ్య ఖాతాలో కాకుండా.. అన్నగారి ఖాతాలోకి వస్తుంది. (Twitter/Photo)
11.సమరసింహారెడ్డి | 13 జనవరి 1999న విడుదలైన సమరసింహారెడ్డి సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా.. బాలయ్య సంక్రాంతి సినిమాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. (File/Photo)
22. వీరసింహారెడ్డి | 12 జనవరి 2022న మరికొన్ని గంటల్లో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెడ్డి టైటిల్‌తో సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి తర్వాత తెరకెక్కిన బాలయ్య మూడో సినిమా. ఈ చిత్రంలో బాలయ్య వీరసింహారెడ్డిగా.. బాల నరసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు.
ఇక జనవరి 12న బాలయ్య నటించిన ప్రాణానికి ప్రాణం, పరమవీరచక్ర, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా విడుదలైతే.. అందులో చివరి రెండు హిట్ సాధిస్తే.. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. మరి ఇదే డేట్లో జవనరి 12 విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి’ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర విజయం అందుకుంటాడా లేదా అనేది మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. (Twitter/Photo)