NBK - Veera Simha Reddy As Dual Roles : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్య మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. టైటిల్ పాత్రధారి వీరసింహారెడ్డి గా తండ్రిగా.. ఆయన తనయుడు బాల నరసింహారెడ్డిగా రెండు పాత్రల్లో నటించారు. మొత్తంగా నందమూరి నటసింహా తన కెరీర్లో ఎన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారో మీరు ఓ లుక్ వేయండి.
బ్రహ్మర్షి విశ్వామిత్ర | ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా రెండు పాత్రల్లో నటించిన బాలకృష్ణ. ఈ చిత్రాన్ని హిందీలో కూడా తెరకెక్కించారు. అందులో కూడా రెండు పాత్రల్లో నటించారు. తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్ మాత్రం విడుదలకు నోచుకోలేదు. (Youtube/Credit)
చెన్నకేశవరెడ్డి | ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో తొలిసారి తండ్రికొడుకులుగా రెండు పాత్రల్లో మెప్పించిన నట సింహం బాలకృష్ణ. ఈ సినిమా బాలయ్య కెరీర్లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.ఈ సినిమా బాలయ్య కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. రీ రిలీజ్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. (Youtube/Credit)
అఖండ | బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకె ‘అఖండ’లో బాలకృష్ణ.. రెండు పాత్రల్లో అదరగొట్టారు. అది కూడా కవల సోదురులుగా నటించారు. అందులో ఒకరు రైతు పాత్ర అయితే.. మరొకటి అఘెరా. అఘోరా పాత్రనే ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచంది. ఈ సినిమాలో అఖండగా బాలయ్య ఆహార్యం, నటన అదిరిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)