2004.. లక్ష్మీనరసింహా సినిమా విడుదలైంది.. సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వరసగా ఆరేళ్ల పాటు బాలకృష్ణకు ఒక్క హిట్ కూడా రాలేదు. కనీసం యావరేజ్ కూడా లేదు. మధ్యలో ‘మహారథి’, ‘వీరభద్ర’, ‘ఒక్క మగాడు’, లాంటి డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. వరస పరాజయాలతో బాలకృష్ణ పని అయిపోయిందిక అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. (Twitter/Photo)
2010 ఏప్రిల్ 30న విడుదలైన ఈ చిత్రం థియేటర్లపై దండయాత్ర చేసింది. సింహాతో బాలయ్య చాలా ఏళ్ల తర్వాత సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య చెప్పిన ‘చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు మాడిపోతావు అంటూ చెప్పిన డైలాగ్.. థియేటర్స్‌లో మారుమ్రోగింది. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఈ సినిమా డైలాగులను ఆస్వాదించారు. (Twitter/Photo)
ఏ అగ్ర దర్శకుడు కూడా బాలయ్యకు హిట్ ఇవ్వలేక అల్లాడిపోతున్న సమయంలో రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న బోయపాటి శ్రీను లైన్లోకి వచ్చారు. మీకు గుర్తుండిపోయే సినిమా చేస్తాను బాబూ అంటూ మొదలుపెట్టారు ఈ సినిమా. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో డాక్టర్ నరసింహా పాత్రను బోయపాటి శ్రీను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. (Twitter/Photo)
నిర్మాతగా అప్పటి వరకు సరైన హిట్ లేని పరుచూరి కిరీటి.. సంగీత దర్శకుడిగా ఫామ్‌లో లేని చక్రి.. హీరోయిన్లుగా ప్రేక్షకులు మరిచిపోయిన స్నేహా ఉల్లాల్‌తో పాటు టాప్ హీరోయిన్ నయనతారను తీసుకున్నారు. అలా సింహా పట్టాలెక్కింది. ముఖ్యంగా చక్రి అందించిన ‘సింహం అంటూ చిన్నోడు’, ’బంగారు కొండ’ వంటి పాటలు ఆడియన్స్‌ను అలరించాయి. (Twitter/Photo)