నందమూరి నట సింహం బాలకృష్ణ.. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈయన మాస్ మహారాజ్, దర్శకుడు గోపీచంద్ మలినేనిలను తన షోలో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీళ్ల మధ్య కొన్ని ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. (Twitter/Photo)
ఈ సందర్భంగా రవితేజను నీకు కోసం వచ్చినపుడు సరదగా చెప్పే నాలుగు బూతులు చెప్పు. నేను బూతులు మొదలు పెడితే.. ప్రేక్షకులు చస్తారంటూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు రవితేజ. అతి వినయం ధూర్త లక్షణం. చేతులు కట్టుకుంటే డిప్ప పగిలిపోతుందంటూ రవితేజకు బాలయ్యకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అవతల వాడి బిహేవియర్ బట్టి వీడు తేడా అనే విషయం తెలిసిపోతుంది కదా మీకు. లేకపోతే చంప ఛల్లుమనాల్సిందే అంటూ రవితేజ నవ్వించారు. (Twitter/Photo)
మొగల్రాజ పురం అమ్మాయిలకు లైన్ వేసేవాడివంటూ బాలయ్య అడిగిన ప్రశ్నకు రవితేజ అవాక్కయ్యారు. దీనికి బాలయ్య కలగజేసుకొని తప్పేంటయ్యా.. నేను చిన్నపుడు అమ్మాయిలకు లైన్ వేసేవాడినన్నారు. ఇక బాలయ్య అడిగిన ఈ ప్రశ్నలకు రవితేజ మాట్లాడుతూ.. నా గురించి మీకు ఈ విషయాలు ఎలా తెలుసు. ఎవరిచ్చారన్న రవితేజ ప్రశ్నకు బాలయ్య మాది కృష్ణా జిల్లా. మాకు అన్ని తెలుస్తుంటాయని బాలయ్య సరదగా సమాధానం చెప్పారు. ఇక బాలయ్య మాట్లాడుతూ.. మీ అబ్బాయి నీ కంటే టాలెంట్ కదా అనే ప్రశ్నకు రవితేజ మాట్లాడుతూ.. నా కొడుకును DNK అంటూ దొంగ నా కొడుకు అంటూ క్లారిటీ ఇచ్చారు రవితేజ. (Twitter/Photo)
ఇక హెల్త్‌కు, ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మీపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. బాధ ఎక్కడ పడ్డానంటే.. మీడియా దాన్ని పెంట, పెంట చేశారని చెప్పారు. ఇండస్ట్రీలో ఒక్కసారి రూమర్ వచ్చిందంటే అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. చివరికి చిన్న అగ్గిరవ్వ అడవిని అంతా కాల్చేసినట్లు కార్చిచ్చు అవుతుంది. రవితేజ, బాలయ్య విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఇద్దరి మధ్య అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కింద ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి అప్పట్లో రవితేజను పిలిచి బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా వార్తలు కనిపిస్తుంటాయి. ఈ విషయమై ఈ షో వేదికగా బాలకృష్ణ, రవితేజ క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా ఈ షోలో ఇంకెన్ని సంచలన నిజాలు బయటపడతాయో చూడాలి. .(Twitter/Photo)
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ సంక్రాంతి తర్వాత జనవరి 20 నుంచిఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో కంప్లీట్ చేయనున్నారట. ఈ సినిమా బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఇంకో కథానాయికగా భావన నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ’వేట పాలెం’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. (Twitter/Photo)