NBK-Raghavendra Rao - Balakrishna - Unstoppable With NBK S2 | నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు అన్‌స్టాపబుల్ అంటూ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ వారం ఈ షోకు అల్లు అరవింద్, సురేష్ బాబుతో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య పలు చిత్రాల్లో నటించారు. (Twitter/Photo)
టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ, కే.రాఘవేంద్ర రావు కలయిలో పలు చిత్రాలు వచ్చాయి. వీళ్ల కలయికలో మొత్తంగా 7 చిత్రాలు వచ్చాయి. అందులో ఒక సినిమాలో బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ తర్వాత సోలో హీరోగా 6 చిత్రాల్లో నటించారు. వీటిలో హిట్ ప్లాప్స్ విషయానికొస్తే.. (Twitter/Photo)
బాలకృష్ణ, కే.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం ‘పాండురంగడు’. దర్శకేంద్రుడు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాండురంగడు’లో భగవంతుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు బాలయ్య. అప్పటి ఎన్టీఆర్ నటించిన ‘పాండురంగ మహత్యం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ముందుగా ఈ చిత్రానికి ‘రంగ పాండురంగ’ అనే టైటిల్ అనుకున్నారు. చివరకు ‘పాండు రంగడు’ టైటిల్ ఫిక్స్ చేశారు. (Youtube/Credit)
ఈ వారం అన్‌స్టాపబుల్ సీజన్ 2లో రాఘవేంద్రరావుతో బాలయ్య మధ్య వీటి గురించి చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్‌కు అడివి రాముడు సహా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకేంద్రుడు .. బాలకృష్ణకు ఎందుకు ఆ రేంజ్ సక్సెస్‌లు ఇవ్వలేకపోయాడనే విషయాన్ని ఈ షోలో ప్రస్తావించే అవకాశం ఉంది. (Twitter/Photo)