NBK - PSPK - UnStoppable 2: నందమూరి నట సింహా బాలకృష్ణ హెస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లతో పాటు ఇతర కాంట్రవర్షల్ ఇష్యూస్ టచ్ చేయరని అందరు అనుకున్నారు. కానీ ఈ షోలో బాలయ్య పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లనే హైలెట్ చేసినట్టు సమాచారం.దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాాంటి సమాధానం ఇచ్చాడనేది హైలెట్‌గా నిలవనున్నట్టు సమాచారం.
నందమూరి నట సింహా బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. టాలీవుడ్లో నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేస్తోన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక వేదికపై కనిపించడంపై ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థులు తన మూడు పెళ్లిళ్ల ఇష్యూతో పాటు రాజకీయంగా ప్రజారాజ్యం.. ఈ తర్వాత జనసేన పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందనే విషయం ఇందులో హైలెట్‌గా నిలవనున్నట్టు సమాచారం. (File/Photo)
ఇక ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినపుడు యువ రాజ్యం అధినేతగా పవన్ కల్యాణ్ అప్పటి కాంగ్రెస్ నేతలను పంచ లూడదూసి కొడతారన్న చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ ఇష్యూపై బాలయ్య క్వశ్చన్ అడిగినట్టు సమాచారం. ఈ షోలో బాలయ్యను పవన్ కళ్యాణ్.. బాలయ్య గారు అని సంభోదించినట్టు సమాచారం. మరోవైపు బాలయ్య.. పవన్‌ను భయ్యా అంటూ పిలవడం ఈ షోలో హైలెట్ అని చెప్పొచ్చు. (File/Photo)
టీడీపీ నేత కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో జనసేనాని పాల్గొనడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. సెకండ్ సీజన్లో ఇది లాస్ట్ ఎపిసోడ్ అనే టాక్ నడుస్తోంది. (File/Photo)
ఈ టాక్ షోలో ముఖ్యంగా టీడీపీ, జనసేనతతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. దీనిపై పవన్.. సమాధానం దాటవేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ఈ మూడు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఓడించడం సాధ్యం అనే అభిప్రాయాలున్నాయనే అభిప్రాయాలు టీడీపీ, జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకు అన్‌స్టాపబుల్ వేదిక కానున్నట్టు సమాచారం. (Twitter/Photo)
ఏది ఏమైనా సినీ రంగంలో భిన్న ధృవాలైన విభిన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు లెగసీ ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఒక షోలో కలుసుకోవడం మాములు విషయం కాదు. వీళ్లిద్దరి మధ్య రాజకీయంతో పాటు సినీ రంగానికి సంబంధించిన విషయాలతో పాటు వీళ్లిద్దరి మధ్య ఉన్న పర్సనల్ అనుబంధం కూడా ఈ షోలో ఎక్కువగా ప్రస్తావించినట్టు సమాచారం. (Photo Twitter)
అన్‌స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు క్రిష్ పూర్తి స్థాయిలో ఎపిసోడ్లో ఉన్నారు. త్రివిక్రమ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ఈషోలో పంచ కట్టుతో సందడి చేసినట్టు సమాచారం. ఇంకోెవైపు ఈ షోలో బాలయ్య. బాబాయి పవన్ కళ్యాణ్ విషయమై రామ్ చరణ్‌కు కాల్ కూడా చేసారు. అటు పవన్ తనయుడు అకిరానందన్ సినీ ఎంట్రీపై బాలయ్య ఓ ప్రశ్న సంధించినట్టు సమాచారం. మొత్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.