NBK - PSPK - Minister Roja: నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా.. అన్ స్టాపబుల్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మన దేశంలోనే ఎక్కువ రేటింగ్ సాధించిన షోగా రికార్డులకు ఎక్కింది. బాలయ్య హోస్ట్ చేస్తోన్న ఈ షో చివరి ఎపిసోడ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ నెల 27న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్ పూర్తైయింది. అయితే బాలయ్య షో పవన్ కళ్యాణ్ వెళ్లడంపై ఏపీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలే చేసారు. (Twitter/Photo)
ఎపుడు ఎలాంటి టాక్ షోలకు వెళ్లని పవన్ కళ్యాణ్ .. బాలయ్య షోకు వెళ్లడంపై రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు కన్నుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోలో పాల్గొన్నట్టు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎటు వెళితే.. ఆయన ఏది చెబితే అదే పవన్ కళ్యాణ్ చేస్తాడని మరోసారి ప్రూవ్ అయిందన్నారు. చంద్రబాబు ప్యాకేజ్‌లో భాగంగానే ఆయన వెళ్లిన టాక్ షోకు పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. (twitter/Photo)
గతంలో బాలయ్య.. పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు.. అప్పట్లో బాలయ్య పై తీవ్ర విమర్శలు చేసారు. ఇలా ఒకరిపై ఒకరు బురద చల్లుకున్న వీళ్లు ఇపుడు ఏ ఉద్దేశ్యంతో కలిసారని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. (Pawan and Balakrishna Photo : Twitter)
ఇక రోజా వ్యాఖ్యలపై కొంత మంది నందమూరి, మెగాభిమానులు మాట్లాడుతూ.. ఒకపుడు సినిమాల పరంగా తిట్టుకున్న ఇపుడు అలాంటేవి మనసులో పెట్టుకోకుండా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు బడా ఫ్యామిలికి చెందిన బాలయ్య, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలు కలవడం ఆహ్వానించదగ్గ పరిణామం అంటున్నారు. దీన్ని స్వాగతించాలనే కానీ.. గతంలో జరిగిన గొడవలను రోజా ప్రస్తావించడం సముచితం కాదంటున్నారు.
ఇక రోజా బాలయ్య, పవన్ కళ్యాణ్ విమర్శించడంలో అర్ధముంది. వచ్చే ఎన్నికల్లో టీడీపి, జనసేన పొత్తుల భాగంగా ఈ షోలో కలిసారన్నది. వీల్లిద్దరు కలిస్తే .. ఏపీలో అధికారంలోన్న జగన్ ప్రభుత్వానికి తిప్పలు తప్పవనే ఉద్దేశ్యంతో తన అధినేత వ్యాఖ్యలను ఆమె నోటి వెంట పలకినట్టు నెటిజన్స్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. (File/Photo)
ఏది ఏమైనా నందమూరి నట సింహా బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. టాలీవుడ్లో నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేస్తోన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక వేదికపై కనిపించడంపై ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఏపీలో ఉన్న అధికార పార్టీ నేతలు ఇపుడు ఈ టాక్ షో పై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. (File/Photo)
టీడీపీ నేత కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో జనసేనాని పాల్గొనడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. సెకండ్ సీజన్లో ఇది లాస్ట్ ఎపిసోడ్ అనే టాక్ నడుస్తోంది. (File/Photo)
ఈ టాక్ షోలో ముఖ్యంగా టీడీపీ, జనసేనతతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. దీనిపై పవన్.. సమాధానం దాటవేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ఈ మూడు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఓడించడం సాధ్యం అనే అభిప్రాయాలు టీడీపీ, జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకు అన్‌స్టాపబుల్ వేదిక కానున్నట్టు సమాచారం. (Twitter/Photo)
ఏది ఏమైనా సినీ రంగంలో భిన్న ధృవాలైన విభిన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు లెగసీ ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఒక షోలో కలుసుకోవడం మాములు విషయం కాదు. వీళ్లిద్దరి మధ్య రాజకీయంతో పాటు సినీ రంగానికి సంబంధించిన విషయాలతో పాటు వీళ్లిద్దరి మధ్య ఉన్న పర్సనల్ అనుబంధం కూడా ఈ షోలో ఎక్కువగా ప్రస్తావించినట్టు సమాచారం. ఏది ఏమైనా బాలయ్య, పవన్ కళ్యాణ్ కలయిక ఇపుడు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. (Photo Twitter)