క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక సినిమా తర్వాత బాలకృష్ణ తన 101వ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసారు. ఇందులో బాలయ్య సరసన శ్రియ మూడోసారి బాలయ్యకు జోడిగా నటించింది. కేవలం 76 రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీట్లో కంప్లీట్ చేసారు దర్శకుడు పూరీ జగన్నాథ్. (Twitter/Photo)
ముఖ్యంగా బాలయ్య చెప్పిన ‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. ధిమాక్ తోడా.. చాలా తేడా.. అంటూ చెప్పిన డైలాగులు బాలయ్య అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో కబీర్ బేడి, కైరా దత్, ముస్కాన్ సేథి నటించారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. (Twitter/Photo)