NBK Akhanda Team In Yadadri Temple : నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో హీరో బాలకృష్ణ అఖండ చిత్ర యూనిట్‌తో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుని స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ, పానకాల లక్ష్మీ నరసింహా స్వామితో పాటు పలు దేవాలయాలను సందర్శించిన చిత్ర యూనిట్.. తాజగా తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని హీరో బాలకృష్ణ ‘అఖండ’ చిత్ర యూనిట్‌తో కలసి దర్శించుకున్నారు. అఖండ యూనిట్ సభ్యులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.(Twitter/Photo)
కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుండి ప్రజలందరినీ భగవంతుడు రక్షించాలని కోరారు హీరో నందమూరి బాలకృష్ణ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అఖండ సినిమా విజయం దైవ సంకల్పమని బాలకృష్ణ అన్నారు. మనిషి ఎంత కష్టపడినా అంతిమంగా దైవ అనుగ్రహం ఉంటేనే విజయం సంపూర్ణం అవుతుందన్నారు. ఆ నమ్మకంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం జరిగిందనన్నారు. తనకు లక్ష్మి నర్సింహస్వామి అంటే అత్యంత ఇష్టమని అన్నారు. (Twitter/Photo)
ఇక యాదాద్రి పునర్నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని బాలకృష్ణ కితాబు ఇచ్చారు. రాబోయే రోజుల్లో యాదాద్రి క్షేత్రం ఒక మహిమాన్విత క్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అఖండ సినిమా అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ఆయన మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. హీరో నందమూరి బాలకృష్ణ తో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. (Twitter/Photo)