Unstoppable| Balakrishna - Mohan Babu - Chiranjeevi : నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అంటూ ఓ టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో అల్లు అరవింద్ నిర్మాణంలో దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ షోలో మోహన్ బాబును చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు వేసారు. దానికి మోహన్ బాబు చెప్పిన సమాధానం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. (Twitter/Photo)
ఈ షోలో బాలకృష్ణ చిరంజీవి పై అడిగిన క్వశ్చన్స్ షోలో హైలెట్‌గా నిలిచాయి. బాలయ్య తొలిసారి హోస్ట్‌గా నిర్వహించిన ఈ షో చూస్తుంటే.. ఈ షోకు బాలయ్య హోస్టా.. మోహన్ బాబు హోస్టా అనే డౌట్స్ రాక మానవు. అలా బాలయ్య వేసిన ప్రశ్నలకు మోహన్ బాబు అదే రీతిలో సమాధానాలు ఇవ్వడంతో పాటు .. బాలయ్యను ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించి ఉక్కిరి బిక్కిరి చేశారు. (Photo : Twitter)
ఇప్పటికే నాగార్జున, ఎన్టీఆర్, చిరంజీవి, రానా, నాని వంటి హీరోలు స్మాల్ స్క్రీన్ పై సందడి చేశారు. ఈ కోవలో కాస్తా ఆలస్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఎంట్రీ ఇచ్చి నిజంగానే ‘అన్‌స్టాపబుల్’ అనిపిస్తున్నారు బాలకృష్ణ. తొలిసారి అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం బాలయ్య.. హోస్ట్ అవతారం ఎత్తారు. ఈ షో ఫస్ ఎపిసోడ్‌కు మంచు మోహన్ బాబు ఫస్ట్ గెస్ట్‌గా హాజరయ్యారు. మధ్యలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మితో పాటు మంచు విష్ణు కలిసి కాసేపు సందడి చేశారు. (Twitter/Photo)
ఈ షోలో బాలయ్య.. చిరంజీవి గురించి మీ అభిప్రాయం చెప్పమని మోహన్ బాబును అడగగా.. దానికి మోహన్ బాబు .. మాట్లాడుతూ.. చిరు మంచి నటుడు.. అద్భుతంగా డాన్సులు చేస్తారు. వ్యక్తిగతంగా ఆయనపై నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు. పైగా నా సహ నటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఆయనతో ఎన్నో సినిమాలు కలిసి పనిచేశాను. సురేఖ నాకు సోదరి లాంటిది. మన ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆయన బాగున్నారంటూ కామెంట్స్ చేశారు. (Twitter/Photo)
అన్ని షోల మాదిరి ఇందులో ఓపెన్ టాక్ ఏం ఉండదు. మనిషిలోని రియాలిటీని బయటికి తీసుకొచ్చే షో ఇది అంటున్నారు బాలయ్య. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని నిజాలు ఇందులో చూపించబోతున్నాడు బాలయ్య. వాళ్లను ఇబ్బంది పెట్టకుండా.. వచ్చిన అతిథులను అద్భుతంగా చూసుకుంటూనే తనకు కావాల్సిన సమాచారం రాబడతాను అంటున్నాడు బాలయ్య. ఈ షోకు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. (Twitter/Photo)