NTR - Chiranjeevi - Nagarjuna | టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, రానా వంటి స్టార్స్ ఆ రూట్లో వెళ్లారు. తాజాగా నందమూరి నట సింహా బాలకృష్ణ తొలిసారి స్మాల్ స్క్రీన్ పై హోస్ట్‌గా దర్శనమివ్వనున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని వంటి హీరోలు స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు అదే రూట్లో నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అయ్యారు. దీని కోసం బాలయ్య సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. దానికి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Twitter/Photo)
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. అయితే సినిమాల పరంగా క్రేజ్ ఉన్న హీరోలు.. మరోవైపు కమర్షియల్ యాడ్స్‌తో ఆయా బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాల పరంగా క్రేజ్‌ను హీరోలు స్మాల్ స్క్రీన్ పై టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, రానా వంటి స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కోవలో బాలయ్య కూడా చేరారు. మొత్తంగా బిగ్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ మెప్పించిన స్టార్స్ ఎవరెరున్నారో చూద్దాం..
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో మరోసారి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి రియాలిటీ షోతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఈ షోకు మంచి టీఆర్పీ సాధిస్తోంది. తారక్ ఈ షోను ఎంతో ఆసక్తిగా రన్ చేస్తున్నారు. అంతేకాదు హాట్ సీట్లో ఉన్నవారితో వారి పర్సనల్ విషయాలతో పాటు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఈ షోపై క్రేజ్ తీసుకొస్తున్నారు. (Jr NTR)
కమెడియన్ అలీ కూడా ‘ఆలీ తో సరదగా’ ప్రోగ్రామ్‌లో యాంకర్‌గా పలువరు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నారు. సెలబ్రిటీ ఇంటర్వ్యూల్లో ఆలీ తో సరదగా ప్రోగ్రామ్ ఈటీవీలో టాప్ రేటేడ్ ప్రోగ్రామ్‌గా ఇప్పటికీ అదే దూకుడు కొనసాగిస్తోంది. గత 250 వారాలుగా ఈ షోను సక్సెస్‌పుల్‌గా రన్ చేస్తున్నారు. (file/photo)