NBK - Rowdy Inspector : తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా వస్తుందంటే.. ఆ మూవీపై అంచనాలు మాములుగా ఉండవు. అలా నందమూరి బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో పోలీస్ సినిమాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. (Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్గా బి.గోపాల్ దర్శకత్వంలో విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే కాదు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. (Twitter/Photo)
విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. ఆ రోజుల్లోనే 35 సెంటర్లలో 100 రోజులు ఆడింది. విజయశాంతి ఈ చిత్రంలో ఆటో రాణి పాత్రలో రప్ఫాడించింది. తమిళ్లో ఈ సినిమాను అదే పేరుతో అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. (Twitter/Photo)
‘రౌడీ ఇన్స్పెక్టర్’ హిందీలో అదే టైటిల్‌తో డబ్ చేస్తే.. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి వరకు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ముంబైలో రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇన్స్పెక్టర్ రామరాజు పాత్రలో నటిస్తే.. విజయశాంతి ‘ఆటో రాణిగా మెప్పించారు. ఇక బొబ్బర లంక రామబ్రహ్మంగా మోహన్ రాజ్ తనదైన విలనిజం పండించారు. (Twitter/Photo)