నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి(Veerasimha Reddy) సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంతకంటే ముందుగానే ఈ రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో కూడిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. (Twitter/Photo)
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. బాల నరసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నారు. ఈ వేడుకకు బాలయ్య గోల్డ్ కలర్ బ్లేజర్‌తో హాజరయ్యరు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య మాట్టాడుతూ.. ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పను. బాగా ఆడి తీరుతుందని చెప్పడం హైలెట్. (Twitter/Photo)
ప్రీ రిలీజ్ వేడుకలతో విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. (Twitter/Photo)
ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో ఉండబోతుందని ట్రైలర్ చూసి చెప్పొచ్చు. ఈ ట్రైలర్‌ను బాలయ్యను ఫ్యాక్షనిజం సినిమాల వైపు అడుగులు వేసేలా చేసిన బి.గోపాల్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా బి.గోపాల్ ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్య తరహా హై ఓల్టెజ్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూసి చెప్పవచ్చు. (Twitter/Photo)
ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ తనకు చెంఘీజ్ ఖాన్‌పై సినిమా చేయాలని ఉన్నదని.. అది నా ఆశయం అంటూ పేర్కోన్నారు. దీంతో నెటిజన్స్ అసలు ఈ చెంఘీజ్ ఖాన్ ఏవరా అని ఆరా తీస్తున్నారు.చెంఘీజ్ ఖాన్ మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు. ఆయన పునాదివేసిన మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యంగా పేర్గాయించింది. చెంఘీజ్ ఖాన్ ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచారజాతికి చెందినవాడని అంటారు. ప్రపంచం ఎరిగిన ఓ గొప్ప వీరుడు చెంఘీజ్ ఖాన్. చూడాలి మరి బాలయ్య కోరిక నెరవేరుతుందో లేదో.. Photo : Twitter
ఇక ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాకు u/a సర్టఫికేట్ వచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ రెండు గంటల నలభై మూడు నిమిషాలకు లాక్ అయిందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే జై బాలయ్య అంటూ ఓ పాట విడుదలవ్వగా ఇక లేటెస్ట్గా రెండో సింగిల్ సుగుణ సుందరి లిరికల్ సింగిల్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ పాటను బాలయ్య, శృతిహాసన్‌లపై రొమాంటిక్‌గా చిత్రీకరించారు. అంతేకాదు ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఇతర ప్రచార చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. Photo : Twitter
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య, శృతి హాసన్ తో పాటు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి.. చూడాలి మరి ఈ సినిమాల్లో సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలవనున్నారో.. Photo : Twitter