Balakrishna - Boyapati Sreenu: నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ అభిమానులందరికీ బాలయ్య బాబు గురించి తెలిసిందే. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు.. ఇంకోవైపు అన్‌స్టాపబుల్ షోతో పాటు బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు.ఈయన హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.ఇక బాలయ్యకు గత పదిహేనేళ్లలో హిట్టైన సినిమాల్లో 3 సినిమాలు బోయపాటి శ్రీను సినిమాలు ఉండటం విశేషం.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్స్, చెరుకురు సుధాకర్ SLV సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కబోతంది. ఈ సినిమా జూన్ 10న అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లి వచ్చే సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. (Twitter/Photo)
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఉగాది సందర్భంగా విడుదల చేసిన లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు బోయపాటి శ్రీను కూడా రామ్ పోతినేని హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఈ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత బోయపాటి, బాలయ్య నాలుగో సినిమా మొదలు కానుంది.
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ విషయానికొస్తే.. ఈ డిజిటల్ యుగంలో ఒక సినిమా ఓ థియేటర్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవడం అది.. మొత్తంగా గత పదేళ్లలో ఒక హీరో సినిమా 100 రోజులతో పాటు ఏకంగా ఒక కేంద్రంలో 175 రోజులు పూర్తి చేసుకోవడం మన దేశంలో బాలయ్యకు మాత్రమే సాధ్యమైందనే చెప్పాలి. తాాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. మొత్తంగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అపుడే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పక్కర్లేదు.