Akhanda - 1 Year | నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం నేటితో (శుక్రవారం)తో యేడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సాధించిన రికార్డుల విసయానికొస్తే..
ఈ డిజిటల్ యుగంలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల వేడుకకు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో 50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు.
ఈ డిజిటల్ యుగంలో ఒక సినిమా ఓ థియేటర్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవడం అది.. మొత్తంగా గత పదేళ్లలో ఒక హీరో సినిమా 100 రోజులతో పాటు ఏకంగా ఒక కేంద్రంలో 175 రోజులు పూర్తి చేసుకోవడం మన దేశంలో బాలయ్యకు మాత్రమే సాధ్యమైందనే చెప్పాలి. బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. (Twitter/Photo)
బాలయ్య చిత్రాలకు ఎక్కువ వసూళ్లు ఈ ఏరియాల్లోంచే వస్తుంటాయి. ఈ ఏరియాలోని బాలయ్య సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటాయి. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ సినిమా కడప, కర్నూలు జిల్లా సెంటర్స్‌లో 400 రోజులు పైగా ఆడింది. కడపలో ఓ సెంటర్లో 1000 రోజులు పైగా ప్రదర్శించబడింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు ఈ రికార్డు లేదు. (Twitter/Photo)
సీడెడ్‌లో ఈ రెంజ్లో 100 రోజులకు పైగా బాలయ్య సినిమాలు ఓ రేంజ్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. రాయలసీమలో ఈ రికార్డు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే. బాలయ్య గత సినిమాలు పెద్దన్నయ్య, సమమర సింహా రెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా సినిమాల తర్వాత ‘అఖండ’ ఆ లిస్టులో చేరింది. (Twitter/Photo)
ఈ సినిమాలే కాకుండా బాలయ్య నటించిన పలు సినిమాలు షిప్టులతో 100 రోజులు ఆడిన సందర్భాలున్నాయి. ఇందులో సమరసింహాెరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. లెజెండ్ ఏకంగా 421 రోజులు ఆడి హిస్టరీ తిరగ రాసింది. అఖండ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.55 కోట్ల షేర్.. రూ. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. రీసెంట్గా 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అఖండ సినిమా ప్రదర్శితం అయింది. అక్కడ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. (Twitter/Photo)