NBK - Akhanda | నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ సాధించిన విజయంతో చిత్ర యూనిట్‌తో చిత్ర యూనిట్ విజయవాడ కనకదుర్గమ్మతో పాటు మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. (Twitter/Photo)
2021లో ఓవర్సీస్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ యేడాది ఓవర్సీస్లో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో పాటు ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు ఏవి యూఎస్‌లో 1 మిలియన్ యూఎస్ డాలర్లు వసూళ్లు చేయలేకపోయాయి. కానీ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఊర మాస్ చిత్రం ‘అఖండ’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో పర్ఫామెన్స్ చేస్తోంది. (Twitter/Photo)
అఖండ సినిమా రూ. 100 కోట్లు దాటి అడుగులు వేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రేడ్ వర్గాలను సైతం షాక్ చేసేలా అఖండ ప్రభంజనం సాగుతుంది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తున్నాడు ఈయన. అఖండ సినిమా 13 రోజుల్లోనే 108 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన 13వ రోజు కూడా రూ. 2 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ. (Twitter/Photo)