నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్‌తో పాటు శాటిలైట్ ప్రసారానికి ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. (Twitter/Photo)
2021లో ఓవర్సీస్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ యేడాది ఓవర్సీస్లో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో పాటు ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు ఏవి యూఎస్‌లో 1 మిలియన్ యూఎస్ డాలర్లు వసూళ్లు చేయలేకపోయాయి. కానీ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఊర మాస్ చిత్రం ‘అఖండ’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో పర్ఫామెన్స్ చేస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ మొత్తం కలిసి 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. తాజాగా ఒక్క యూఎస్ బాక్సాఫీస్ దగ్గరనే ‘అఖండ’ మూవీ 1 మిలియన్ యూఎస్ డాలర్స్ వసూళు చేసినట్టు చిత్ర యూనిట్ అపీషియల్‌గా ప్రకటించింది. (Twitter/Photo)