NBK - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ ఖాతాలో మరో రికార్డు.. 2021లో ఓవర్సీస్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ యేడాది ఓవర్సీస్లో విడుదలైన ‘వకీల్ సాబ్’ తో పాటు ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు ఏవి యూఎస్‌లో 1 మిలియన్ యూఎస్ డాలర్లు వసూళ్లు చేయలేకపోయాయి. కానీ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఊర మాస్ చిత్రం ‘అఖండ’ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో పర్ఫామెన్స్ చేస్తోంది. ఇక రాబోయే ‘పుష్ప’ ‘శ్యామ్ సింగరాయ్’ ల విడుదల తర్వాత యూఎస్‌లో ఈ లెక్కలు మారుతాయా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)
బోయపాటి శ్రీను డైరెక్షన్.. బాలయ్య నెవర్ బిఫోర్ యాక్షన్ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకతో పాటు ఓవర్సీస్లో పైసా వసూల్ చేస్తోంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మన దేశ కరెన్సీలో రూ. 6.58 కోట్లు వసూళు చేసింది. అటు ఆస్ట్రేలియాలో రూ. 1.26 కోట్లు.. UKలో 0.72 కోట్లు.. యూరోప్ .. 0.15 కోట్లు.. గల్ఫ్ కంట్రీస్ 0.80 కోట్లు.. కెనడాలో 0.25 కోట్లు.. సింగపూర్‌లో 0.13 కోట్లు.. మలేషియాలో 4 లక్షలు.. మిగతా అన్ని కంట్రీస్ కలిపి రూ. 20 లక్షల వరకు వసూళ్లు సాధించింది. మొత్తంగా యూఎస్ కలిపి మొత్తం ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా రూ. 10.08 కోట్లు వసూళు చేసింది. ఆ వసూళ్లకు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేసారు. (Twitter/Photo)
అంతేకాదు ఇప్పటికే మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా 2వ వారంలో కూడా మంచి వసూళ్లనే రాబడుతున్నట్టు తెలుస్తోంది. శని, ఆది వారాలు వీకెండ్లో మరోసారి కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ‘అఖండ’కు పోటీ ఇచ్చే సినిమా ఏది విడుదల కాకపోవడం ‘అఖండ’ సినిమాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా ఓవర్సీస్లో ఎంత వసూళు చేస్తుందో చూడాలి. (Twitter/Photo)
అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వారం రోజుల్లోనే 54.50 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా అఖండ సేఫ్ జోన్‌కు వచ్చింది. ఇప్పటి నుంచి వచ్చేవన్నీ లాభాలే. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్లో బాలయ్య దుమ్ము లేపారు. ఈ రెండు చోట్ల వసూళ్లు అదిరిపోయాయి. లాభాలు కూడా భారీగానే వస్తున్నాయి. 9వ రోజు కూడా దాదాపు రూ. 1 కోటి వరకు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రూ. 56 కోట్ల వరకు షేర్ రాబట్టింది. రూ. 93 కోట్ల గ్రాష్ వసూళ్లను సాధించినట్టు తెలుస్తోంది.(Twitter/Photo)