అఖండ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని టాక్. అది అలా ఉంటే ఈ సినిమా టైటిల్‌పై రకరకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీమ్ క్లారిటీ ఇవ్వనుంది. ఈ సినిమా టైటిల్న కర్నూలులోని కొండా రెడ్డి బురుజు దగ్గర కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ట్యాగ్ లైన్‌గా ‘గాడ్ ఆఫ్ మాసెస్ అని పెట్టారు. Photo : Twitter
అఖండ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (NBK 107 Title Photo : Twitter)
ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య .. ఫ్యాక్షనిస్ట్, మరియు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు బాలయ్య. నటసింహం చేతికి లాఠీ వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. పోలీస్ కారెక్టర్స్ బాలయ్యకు బాగానే కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే చేయబోతున్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని కూడా హీరోలను పోలీస్ కారెక్టర్స్‌లో బాగానే ప్రజెంట్ చేస్తాడు. (Twitter/Photo)
ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాసింది. మన దేశంలో నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు. తాజాగా సెకండ్ సీజన్ ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చంద్రబాబు, లోకేష్ ఫష్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్లుగా వచ్చారు. రెండో ఎపిసోడ్లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ సందడి చేశారు. (Twitter/Photo)
ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు అని చెబుతున్నారు. మరోవైపు సాధువు పాత్రలో కూడా నటించబోతున్నట్టు కూడా చెబుతున్నారు. మొత్తంగా ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.(Twitter/Photo)